13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు

పొనుగుపాడు గ్రామంలో అభినయ నాటక పరిషత్ – (2018) 13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడులో ది.12.01.2017 శుక్రవారం నుండి ది.14.01.2017 ఆదివారం వరకు జరుగును.

నాటక కళను ఆదరించండి.మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపించే, వినిపించే జీవిత సత్యాలు నాటకరంగంలో మాత్రమే తెలుస్తుంది

12.01.2017 శుక్రవారం 

సాయంత్రం గం.6.00లకు అరవింద ఆర్ట్సు, తాడేపల్లి వారిచే “ఆగ్రహం” నాటిక. రచన:వల్లూరి శివప్రసాద్, దర్శకత్వం: గంగోత్రిసాయి

రాత్రి గం.7.15 ని.లకు సాయి ఆర్ట్స్, కొలకలూరు వారిచే “మధురం” నాటిక.రచన: పి.వి.భవాని ప్రసాద్, దర్శకత్వం: గోపరాజు విజయ్

రాత్రి గం.8.30 ని.లకు ఉషోదయ కళానికేతన్, కట్టపాడు వారిచే “పులికంటే డేంజర్”  నాటిక. రచన, దర్శకత్వం: చెఱుకూరి సాంబశివరావు

13.01.2017 శనివారం 

సాయంత్రం గం.6.00లకు కె.జె.ఆర్.కల్చరల్ అసోసియేషన్, సికింద్రాబాద్ వారిచే “ఖాళీలు పూరించండి” నాటిక.రచన, దర్శకత్వం: ఉదయ్ భాగవతుల

రాత్రి గం.7.15 ని.లకు కళాంజలి, ప్రగతినగర్, హైదరాబాద్ వారిచే “అనంతానంతం” నాటిక. రచన:ఎ.బాస్కరచంద్ర,  దర్శకత్వం: కొల్లా రాధాకృష్ణ.

రాత్రి గం.8.30 ని.లకు గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ & యువకళావాహిని, హైదరాబాద్ వారిచే “స్వామి వివేకానంద” ప్రత్యేక నాటక ప్రదర్శన. రచన:పి.వి.కృష్ణమూర్తి,  దర్శకత్వం: యస్.యమ్.భాషా, నిర్వహణ:బొప్పన నరసింహారావు

14.01.2017 ఆదివారం 

సాయంత్రం గం.6.00లకు గణేష్ ఆర్టు దియేటర్,గుంటూరు వారిచే “తొక్క తీశారు” నాటిక. రచన, దర్శకత్వం: వరికూటి శివప్రసాద్

రాత్రి గం.7.15 ని.లకు శ్రీ మురళీ కళానిలయం, హైదరాబాద్ వారిచే “అం అ: కం క: “ నాటిక. రచన:శంకరమంచి పార్దసారధి,  దర్శకత్వం: తల్లావఝ్జల సుందరం.

రాత్రి గం.8.30 ని.లకు యం.యం.పి స్కూలు,హాజివల్లి,షాద్ నగర్ వారిచే ” తెలంగాణ వారిచే “పసిమొగ్గలు” నాటిక. రచన:దేవి, దర్శకత్వం:టి.వి.రంగయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *