సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల అగ్రస్థానంలో నిలిచిన మన తెలుగు తేజాలు

తెలుగు వాళ్ల  సత్తా చూపించారు

సివిలు సర్వీసెస్ ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలలో  ఒకటైన తెలంగాణాలోని, జగిత్యాల జిల్లా,మెట్‌పల్లికి చెందిన  దురిశెట్టి అనుదీప్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు.మరి కొంత మంది ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 40 మందికి పైగానే వివిధ సివిలు సర్వీసులకు ఎంపికైనట్లు తెలుస్తుంది 

Source:Clipping of Andhra Joythy Telugu daily – Guntur,Dated 27 Aprial 2018 , epaper, andhrajoythy.com , by Aamoda Publications PVT Ltd..

ఎటీఎంలో దొంగ నోట్లు వస్తే భాధ్యత ఎవరిది?

ఆంధ్రజ్వోతి దిన పత్రిక మెయిన్ ఎడిషన్ పేజి నెం.15 (25.04.2018) క్లిపింగ్

ఎటీఎంలో దొంగ నోట్లు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవాలంటే

ప్రత్యేక హోదా అంటే ఏమిటి?

 

అసలు అర్ధం అంతా “ప్రత్యేక” అనే పదంలోనే ఇమిడి ఉంది. ఆలయాలలో ప్రత్యేక దర్శనం గురించి వింటూనే ఉంటాం.అలాగే మన కుటుంబ సభ్యులలో ఆర్దికంగా ఎవరైనా నష్టపోతే తగిన తోడ్పాటు ఇస్తాం.తుపానులు వచ్చినప్పడు నష్టపోయినవార్కి ఆర్దికంగా ఆదుకుంటుంటారు. ఇవన్ని ఒకఎత్తు.ఈ ప్రత్యేకాలు అన్నీ వ్యక్తిగతంగా కొందరికి తాత్కాలిక వెసులుబాటు మాత్రమే.

ఇప్పుడు రాష్ట్రం  అంతా ప్రత్యేక హోదా మీద చర్చ నడుస్తుంది.

కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కు విభజన సమయంలో అప్పటి ప్రధాని వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఏఒక్కరి లబ్ది  కోసమో కాదు. ప్రత్యక్షంగా,పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి మేలు జరిగేది.రాబోవు మందు తరాలవార్కి ప్రయోజనాలు సమకూర్చేది.అలాంటి ప్రత్యేక హోదా గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన కనీస భాధ్యత మనందరిపై ఉంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినప్పుడు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చారు  అవి

  • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 90 క్రింద పోలవరం ప్రాజెక్ట్
  • సెక్షన్ 94  క్రింద పారిశ్రామీకరణకు పన్ను రాయితీలు
  • 20-02-2014న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము అనే ప్రకటన
  • రాష్ట్ర రెవెన్యు లోటుని అంచనా వేసే బాధ్యత 14వ ఆర్ధిక సంఘానికి అప్పగించడం

అసలు రాష్త్రాలకు ప్రత్యేక హోదా  అంటే ఏమిటి? దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకోవటానికి దిగువ లింకుపై క్లిక్ చేయండి.

ప్రత్యేక హోదా (తెలుగు వికీపీడియా వ్యాసం) ఈ లింకుపై క్లిక్ చేయండి

 

చిరుధాన్యాల వంటకాలు

నిండైన ఆరోగ్యానికి మెండైన రుచులు

రాగులుతో పిండి వంటకాలు
చిరుధాన్యాలని చులకనగా చూడకు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ – భారతీయ చిరుధాన్యాల పరిశోధనాసంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్, తెలంగాణ వారి సౌజన్యంతో  జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగలు మొదలగు చిరుధాన్యాలుతో వంటకాలు ఎలా చేసుకోవాలి,వాటితో మన ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో మనందరికి ఉపయోగపడేలాగున, సామాన్య గృహిణిలకు అర్ధమయ్యే  మన తెలుగు భాషలో చిన్న పుస్తకం ప్రచురించారు.

 

 జింకు ఫుడ్స్ పై మోజు తగ్గించి జీవన విధానం మెరుగు పర్చుకోవటానికి ఆ పుస్తకం ఒకసారైనా చదవండి.

పుస్తకం చదవటానికి  ఈలింకు పై క్లిక్ చేయండి

మన అలవాట్లు – మన ఆరోగ్యం

 మన ఆరోగ్యం

ఆరోగ్య,వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సౌజన్యంతో “మన అలవాట్లు – మన ఆరోగ్యం” అనే చిన్న పుస్తకం మనందరం  ఆరోగ్యకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం పొందుటకు అవగాహన నిమిత్తం మార్గదర్శకంగా ప్రచురించిది. ఆ పుస్తకం చదవండి.తగిన జాగ్రత్తలు పాటించండి.

పుస్తకం చదవటానికి లింకుపై క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ మండలాలు, గ్రామాలు

Manadal Wise List of Villages In Andhra Pradesh.

(Click below the links)

1.అనంతపురం జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

2.చిత్తూరు జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

2.కృష్ణా జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

3.కడప (వై.యస్.ఆర్) జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

4.కర్నూలు జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

5.గుంటూరు జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

6.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

7.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

8.ప్రకాశం (ఒంగోలు) జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

9.నెల్లూరు జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

10.విజయనగరం జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

11.విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

12.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలాలు, రెవెన్యూ గ్రామాలు

13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు

పొనుగుపాడు గ్రామంలో అభినయ నాటక పరిషత్ – (2018) 13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడులో ది.12.01.2017 శుక్రవారం నుండి ది.14.01.2017 ఆదివారం వరకు జరుగును.

నాటక కళను ఆదరించండి.మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపించే, వినిపించే జీవిత సత్యాలు నాటకరంగంలో మాత్రమే తెలుస్తుంది

12.01.2017 శుక్రవారం 

సాయంత్రం గం.6.00లకు అరవింద ఆర్ట్సు, తాడేపల్లి వారిచే “ఆగ్రహం” నాటిక. రచన:వల్లూరి శివప్రసాద్, దర్శకత్వం: గంగోత్రిసాయి

రాత్రి గం.7.15 ని.లకు సాయి ఆర్ట్స్, కొలకలూరు వారిచే “మధురం” నాటిక.రచన: పి.వి.భవాని ప్రసాద్, దర్శకత్వం: గోపరాజు విజయ్

రాత్రి గం.8.30 ని.లకు ఉషోదయ కళానికేతన్, కట్టపాడు వారిచే “పులికంటే డేంజర్”  నాటిక. రచన, దర్శకత్వం: చెఱుకూరి సాంబశివరావు

13.01.2017 శనివారం 

సాయంత్రం గం.6.00లకు కె.జె.ఆర్.కల్చరల్ అసోసియేషన్, సికింద్రాబాద్ వారిచే “ఖాళీలు పూరించండి” నాటిక.రచన, దర్శకత్వం: ఉదయ్ భాగవతుల

రాత్రి గం.7.15 ని.లకు కళాంజలి, ప్రగతినగర్, హైదరాబాద్ వారిచే “అనంతానంతం” నాటిక. రచన:ఎ.బాస్కరచంద్ర,  దర్శకత్వం: కొల్లా రాధాకృష్ణ.

రాత్రి గం.8.30 ని.లకు గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ & యువకళావాహిని, హైదరాబాద్ వారిచే “స్వామి వివేకానంద” ప్రత్యేక నాటక ప్రదర్శన. రచన:పి.వి.కృష్ణమూర్తి,  దర్శకత్వం: యస్.యమ్.భాషా, నిర్వహణ:బొప్పన నరసింహారావు

14.01.2017 ఆదివారం 

సాయంత్రం గం.6.00లకు గణేష్ ఆర్టు దియేటర్,గుంటూరు వారిచే “తొక్క తీశారు” నాటిక. రచన, దర్శకత్వం: వరికూటి శివప్రసాద్

రాత్రి గం.7.15 ని.లకు శ్రీ మురళీ కళానిలయం, హైదరాబాద్ వారిచే “అం అ: కం క: “ నాటిక. రచన:శంకరమంచి పార్దసారధి,  దర్శకత్వం: తల్లావఝ్జల సుందరం.

రాత్రి గం.8.30 ని.లకు యం.యం.పి స్కూలు,హాజివల్లి,షాద్ నగర్ వారిచే ” తెలంగాణ వారిచే “పసిమొగ్గలు” నాటిక. రచన:దేవి, దర్శకత్వం:టి.వి.రంగయ్య.