ప్రత్యేక హోదా అంటే ఏమిటి?

 

అసలు అర్ధం అంతా “ప్రత్యేక” అనే పదంలోనే ఇమిడి ఉంది. ఆలయాలలో ప్రత్యేక దర్శనం గురించి వింటూనే ఉంటాం.అలాగే మన కుటుంబ సభ్యులలో ఆర్దికంగా ఎవరైనా నష్టపోతే తగిన తోడ్పాటు ఇస్తాం.తుపానులు వచ్చినప్పడు నష్టపోయినవార్కి ఆర్దికంగా ఆదుకుంటుంటారు. ఇవన్ని ఒకఎత్తు.ఈ ప్రత్యేకాలు అన్నీ వ్యక్తిగతంగా కొందరికి తాత్కాలిక వెసులుబాటు మాత్రమే.

ఇప్పుడు రాష్ట్రం  అంతా ప్రత్యేక హోదా మీద చర్చ నడుస్తుంది.

కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కు విభజన సమయంలో అప్పటి ప్రధాని వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఏఒక్కరి లబ్ది  కోసమో కాదు. ప్రత్యక్షంగా,పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి మేలు జరిగేది.రాబోవు మందు తరాలవార్కి ప్రయోజనాలు సమకూర్చేది.అలాంటి ప్రత్యేక హోదా గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన కనీస భాధ్యత మనందరిపై ఉంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినప్పుడు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చారు  అవి

  • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 90 క్రింద పోలవరం ప్రాజెక్ట్
  • సెక్షన్ 94  క్రింద పారిశ్రామీకరణకు పన్ను రాయితీలు
  • 20-02-2014న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము అనే ప్రకటన
  • రాష్ట్ర రెవెన్యు లోటుని అంచనా వేసే బాధ్యత 14వ ఆర్ధిక సంఘానికి అప్పగించడం

అసలు రాష్త్రాలకు ప్రత్యేక హోదా  అంటే ఏమిటి? దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకోవటానికి దిగువ లింకుపై క్లిక్ చేయండి.

ప్రత్యేక హోదా (తెలుగు వికీపీడియా వ్యాసం) ఈ లింకుపై క్లిక్ చేయండి

 

Leave a Comment